The following text field will produce suggestions that follow it as you type.

Jnapakaalu (Part 2)
Jnapakaalu (Part 2)

Jnapakaalu (Part 2)

Current price: $18.99
Loading Inventory...
Get it at Barnes and Noble

Size: OS

Get it at Barnes and Noble
దిగవల్లి శివరావుగారు రాసిన అనుభవాల ఆధారంగా ఆయన కుమారుడు రామచంద్రగారు మంచి వ్యాసాలు ప్రచురించారు. అప్పటి కాల పరిస్థితులలో మధ్యతరగతి చదువుకున్నవాళ్లు దిగవల్లి వెంకట శివరావుగారు వివరించిన బ్రహ్మసమాజంలో చేరడానికి రకరకాల ఆలోచనలు, యుక్తులు అనుసరించారు. బ్రహ్మసమాజంలో చేరాలని వుంది కాని అంత కొత్త ఆచారాలు అనుసరించడానికి ఉత్సాహం వున్నా ధైర్యం చాలక రకరకాల మార్గాలలో కొంత చేరి, కొంత చేరక, ఎన్ని రకాల బ్రహ్మసామాజికులు తయారయారో శివరావుగారి వ్యాసాల్లో మనకి క్షుణ్ణంగా తెలుస్తుంది. బ్రహ్మసమాజం చాలా యిబ్బందులు ఎదుర్కోవలసిన అవసరాన్ని యెదురుగుండా పెట్టింది. అంతకుముందు తమకి వున్న ఆచారాల్ని అన్నిటినీ వదులుకోవలసిన అవసరాన్ని కల్పించింది. ఇంత కొత్త రకమైన పని చేయడానికి ఉత్సాహం వున్నా వాళ్లకి అంతకి ముందు వున్న నమ్మకాలని వదులుకోడానికి అందరూ సిద్ధంగా లేరు. అందుకని వాళ్లు అనుసరించిన అరకొర విధానాలు ఈ వ్యాసాల్లో నవ్వు పుట్టించేటంత విపులంగా చెప్పారు శివరావుగారు. ఈ వ్యాసాలు ప్రచురించి ఇరవయ్యవ శతాబ్దపు తొలిరోజుల్లోని మన సమాజపు పరిస్థితులను స్పష్టంగా చూపించారు ఈ వ్యాసాల్లో.
Powered by Adeptmind